
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 295వ డివిజన్ బౌరంపేట్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (Special Intensive Revision – SIR)ను *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి * బూత్ లెవెల్ అధికారులతో (BLOలు) కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఓటరు జాబితాలో ఖచ్చితత్వం ఉండేలా అవసరమైన వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు.
ప్రజలు బీఎల్ఓల ద్వారా అందించే ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సక్రమంగా నింపి సమర్పించాలని, ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని పేర్కొన్న ఆయన, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
