వైద్య వృత్తి పవిత్రమైంది…… సాహితీ కళావేదిక

Spread the love

వైద్య వృత్తి పవిత్రమైంది…… సాహితీ కళావేదిక
వనపర్తి

సమాజంలోని అన్ని వృత్తులలోకెల్లా వైద్యవృత్తి అత్యంత పవిత్రమైందని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు.జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ప్రఖ్యాత వైద్యులు డా.నాగరాజును ఆయన ఆస్పత్రిలో కళావేదిక సభ్యులు శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య వైద్యం సమాజంలో మనిషికి అత్యంత అవసరమని వీటిని సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.పలు రకాల కల్తీ కాలుష్యాల వల్ల కొత్త రకాలైన జబ్బులు ప్రబలుతున్నాయని ఇవి రాకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.మానవతా దృక్పథంతో డాక్టర్లు ప్రజలకు సేవ చేయాలని శంకర్ గౌడ్ కోరారు.ఈ కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు దేశి రాములు యాదవ్,బైరోజు చంద్ర శేఖర్,డా.శ్యాం సుందర్,బుచ్చిబాబు, శైలజ తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top