
పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తాం.
నాణ్యమైన విద్య.. సూచి రుచితో కూడిన భోజనం అందించాలి.
పాఠశాల పరిశుభ్రత, విద్యార్థుల భద్రతపై ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలి.
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సుచి రుచితో కూడినభోజనంఅందించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం లో వి పి ఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్ ను, అదనపు తరగతి గదులను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా శాఖలో వినూత్న మార్పులు చేస్తూ ప్రభుత్వ పాఠశాల ఉన్నతికి కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో నాడు నేడు పనులలో సంపూర్తిగా ఉంటూ ఇబ్బంది పడుతున్న రాజుపాళెంపాఠశాలలో ఇబ్బందులను తమ దృష్టికి తీసుకురావడంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 20 లక్షలతో అదనపు తరగతి గదులు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందించే భోజనంలో సుచి, రుచితో, కూడిన నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
విద్యార్థులు వంటగది వరకు వెళ్లకుండా వంటగదిలో వండిన పదార్థాలను డైనింగ్ హాల్ లాగా ఒక హాల్ లో విద్యార్థులకు వడ్డించే బాధ్యత పాఠశాల బృందం తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణను సైతం శుభ్రంగా ఉంచుకునేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అదేవిధంగా విద్యార్థుల భద్రత నాణ్యం అనే విద్య అందించాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులన్నీ ప్రభుత్వం కల్పిస్తుంది అన్నారు. అంతేకాకుండా తమ దృష్టికి వచ్చిన సమస్యలను సైతం త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కొడవలూరు మండల అధ్యక్షుడు నాప వెంకటేశ్వర్లు నాయుడు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
