
శ్రమకు గౌరవం… ప్రపంచ మెకానిక్‌ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ద్విచక్ర వాహనాల మెకానిక్ సంక్షేమ సంఘం…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం, ప్రపంచ మెకానిక్‌ల దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం ద్విచక్ర వాహనాల మెకానిక్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గాంధీనగర్‌లో ఉన్న సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం గౌరవ అధ్యక్షుడు, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంఘ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి మెకానిక్‌లకు స్వీట్లు పంపిణీ చేసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, మెకానిక్‌లు సమాజానికి ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వారి శ్రమతోనే ప్రజల రవాణా వ్యవస్థ సజావుగా సాగుతోందని పేర్కొంటూ, మెకానిక్‌ల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో 11వ. డివిజన్ కార్పొరేటర్ దాసరి విజయ్, సంఘం గౌరవ సలహాదారులు సత్యం, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బజాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మాతంగి శివరాజ్, సంయుక్త కార్యదర్శులు ఆరెపల్లి కుమార్, మనోహర్, గోపిశెట్టి సంతోష్, రాములు, భాస్కర్, స్వామి, సురేష్, యూసుఫ్, రియాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
