పెద్దపల్లిలో జూలై 8న. మెగా జాబ్ మేళా, 67 ఉద్యోగాలకు అవకాశం..

TEJA NEWS

పెద్దపల్లిలో జూలై 8న. మెగా జాబ్ మేళా, 67 ఉద్యోగాలకు అవకాశం…

పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి:
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జూలై 8న పెద్దపల్లిలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు. కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో ఖాళీగా ఉన్న 67 ఉద్యోగాల భర్తీ కోసం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం (ఇంటర్మీడియట్ డాక్యుమెంట్) మొదటి అంతస్తులోని రూమ్ నెం. 233లో ఉదయం 11 గంటలకు ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ జాబ్ మేళాలో సేల్స్ ఎగ్జిక్యూటివ్-60, ఫీల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్-4, హెచ్‌ఆర్-2, ఆఫీస్ బాయ్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా డిప్లొమా, ఫీల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్, హెచ్‌ఆర్ పోస్టులకు ఎంబీఏ (మార్కెటింగ్) లేదా హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కోర్సులు, ఆఫీస్ బాయ్ పోస్టుకు పదో తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారు అర్హులని తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు అప్‌డేటెడ్ బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు జిరాక్స్, అనుభవ పత్రాలు (ఉన్నట్లయితే) వెంట తీసుకుని జూలై 8న ఉదయం 11 గంటలకు జాబ్ మేళాకు హాజరై తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వివరాల కోసం 9908674056, 8985336947, 8121262441 నంబర్లను సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ కోరారు.

You cannot copy content of this page

Scroll to Top