
సింగరేణి ఆర్జీ-1 సివిల్ డిపార్ట్మెంట్‌లో వాల్వ్ ఆపరేటర్లకు ప్రమోషన్ ఆర్డర్ల పంపిణీ…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని సివిల్ డిపార్ట్మెంట్‌లో యాక్టింగ్ వాల్వ్ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ప్రమోషన్ ఆర్డర్లను పంపిణీ చేశారు.
సివిల్ డిపార్ట్మెంట్ డీజీఎం వరప్రసాద్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సివిల్ డిపార్ట్మెంట్ పిట్ సెక్రటరీ దాసరి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రమోషన్ ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా యాక్టింగ్ డ్యూటీలు నిర్వహిస్తున్న కార్మికులకు అధికారికంగా ప్రమోషన్ లభించడం పట్ల కార్మికులు, యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ముగ్గురు కార్మికులకు వాల్వ్ ఆపరేటర్ ప్రమోషన్ ఆర్డర్లు అందజేయగా, జనరల్ అసిస్టెంట్ ప్రేమలతకు ఆఫీస్ ఆర్డర్ కాపీ అందించారు.
కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రవీణ్, సూపర్వైజర్ రవికుమార్, ఏఐటీయూసీ రెసిడెన్షియల్ కమిటీ సభ్యులు బిట్టి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు బొల్లి శ్రీనివాస్, అటికేటి రాజు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు అధికారులు, యూనియన్ నాయకులు అభినందనలు తెలియజేసి, విధుల్లో మరింత బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్షించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
