
5వ తెలంగాణ రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో12 పథకాలను సాధించిన పోలీస్ క్రీడాకారులను సత్కరించిన…….జిల్లా ఎస్పి సునీతరెడ్డి
వనపర్తి ఐదవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనర్ రేట్ లోజూలై 7 నుండి 9 వరకు నిర్వహించిన మీట్లో విశిష్ట ప్రతిభ కనబరిచి12 పథకాలు సాధించిన జిల్లా పోలీస్ క్రీడాకారులను జిల్లా ఎస్పీ కార్యాలయం లో సునీత రెడ్డి అభినందించి ఘనంగా సన్మానించారు
అనంతరం ఎస్పీ మాట్లాడుతూపోలీస్ విధుల తో పాటు రాష్ట్ర స్థాయి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పథకాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు గుర్తింపు తీసుకువచ్చిన ప్రతి క్రీడాకారుడికి అభినందనలు తెలుపుతూ ఇదే విజయోత్సవంతో జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి జిల్లాకు మరిన్ని విజయాలు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు విజేతలు అందరికీ జ్ఞాపకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి బాలాజీ నాయక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు శ్రీనివాస్ పథక విజేత పోలీస్ క్రీడాకారులు మరియు జిల్లా పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
