
నాణెముల సేకరణే హాబీ..
ఆర్ఎంపి వైద్యునిగా సేవలందిస్తూ నాణెముల సేకరణ..
భాష్యకార్ల శ్రీనివాస రావు…
కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో గత ఆరు సంవత్సరాల నుండి ఎక్కువ సమయం నాణెముల సేకరణకు సమయం ఇస్తూ దానితోపాటు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ గా వైద్య సేవలు అందిస్తున్న భాష్యకార్ల శ్రీనివాస రావు 2020 సంవత్సరం నుండి అనేక ప్రాంతాలలో తిరుగుతూ కాణి, అర పైసా,20 పైసల నాణెము నుండి 20 రూపాయల నాణెము వరకు సేకరించి తన వైద్యశాలలో ప్రదర్శిస్తున్నాడు. గ్రామస్తులు, బంధువులు, పిల్లలకు తాను సేకరించిన నాణాలను ప్రదర్శించి వారికి వాటి యొక్క విలువ ఏ కాలంలో ముద్రించారు దాని విలువ అనే వివరాలు తెలియజేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. వృత్తితోపాటు నాణేముల సేకరణ ఎంతో తృప్తినిస్తుందని తెలిపాడు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
