ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరం అల్టిమేటం…
ఆగస్టు 15లోగా డిమాండ్లు పరిష్కరించకపోతే నిరవధిక ఆందోళనలకు హెచ్చరిక….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం, ఎన్‌టీపీసీ రామగుండం–2 యాజమాన్యానికి ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం వినతిపత్రం సమర్పించింది. కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను 2026 ఆగస్టు 15లోగా పరిష్కరించాలని, లేకపోతే నిరవధిక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించింది.
ఫోరం ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్‌టీపీసీలో సుమారు 3,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, వేతనాలు, అలవెన్సులు, సంక్షేమ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవే:
•కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం 60 శాతం వేతన పెంపు కల్పించాలి. •డివిజన్‌ల వారీగా వేతనాలను సవరించి అమలు చేయాలి.• హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులను పెంచాలి.• 60 సంవత్సరాల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచాలి. •
తెలంగాణ, సోలార్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కార్మికులకు సమాన వేతనాలు, సమాన సౌకర్యాలు కల్పించాలి. • ఎన్‌టీపీసీ, పీటీఎస్, డీటీఎస్‌లలో పని చేసే డ్రైవర్లకు నెలకు రూ.5,000 ప్రత్యేక హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలి. •మెడికల్ సౌకర్యాలను మెరుగుపరచి, కాంట్రాక్ట్ కార్మికులకు కుటుంబ సభ్యులతో సహా వైద్య సేవలు అందించాలి. •ఎన్‌టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు విద్యా సౌకర్యాలు కల్పించాలి. •2018 ఒప్పందం ప్రకారం పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలను అమలు చేయాలి. •రామగుండం, తెలంగాణ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్, పెన్షన్, బోనస్ తదితర హక్కులను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. •డివిజన్‌ల వారీగా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి.
ఆగస్టు 15లోపు తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు, నిరవధిక పోరాట కార్యక్రమాలు చేపడతామని యునైటెడ్ ఫోరం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం లో కౌశిక హరి , రెడ్డపాక లక్ష్మణ్, ఎండి యాకూబ్, ఈదునూరి నరేష్, సిహెచ్ ఉపేందర్, రాధారపు రాజ మల్లయ్య, నాంసాని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి, చిలుక శంకర్, దగ్గుల సత్యం, టి శ్రీనివాస్, మేకల కొమరయ్య, ఇజ్జగిరి భూమయ్య, జూపూడి జయసింహ, ఈ రాజేశ్వర్, గొల్లూరి పురుషోత్తం, ఏ శ్రీనివాస్, జింక రాజేశం, చింతల సత్యం, ఈసంపల్లి రాజేందర్ పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
