హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన యూత్ కాంగ్రెస్ నాయకులు…

Spread the love

హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన యూత్ కాంగ్రెస్ నాయకులు…

బీఆర్ఎస్ పాలనలో విద్య, ఉద్యోగ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శ…..

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
రామగుండం అభివృద్ధి ప్రదాత, డీసీసీ అధ్యక్షుడు, రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను యూత్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగ నియామకాల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు.

గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని, నిరుద్యోగ యువతను తీవ్రంగా నిరాశకు గురిచేశారని ఆరోపించారు. అలాంటి పార్టీ నాయకులు ఇప్పుడు ఉద్యోగాలు, విద్య గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్, మండల యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కర్రీ నవీన్ కుమార్, మాజీ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాదే దశరథ్ ధోని, శ్రీధర్ బాబు యువసేన నాయకుడు బాదే రవితేజ, 21వ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్టైంకి నరేష్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top