భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా దుర్గామాత బోనాల మహోత్సవం

TEJA NEWS

భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా దుర్గామాత బోనాల మహోత్సవం…

అమ్మవారిని దర్శించుకున్న నగర మేయర్ మహంకాళి స్వామి….

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, తెలంగాణ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే దుర్గామాత బోనాల మహోత్సవం 8వ కాలనీ ఓసీపీ–3 కృషి భవన్ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ దశమి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నగర మేయర్ మహంకాళి స్వామి పాల్గొని దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాలనీ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు ముస్తఫా, శంకర్ నాయక్, రాములు, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, మాజీ కార్పొరేటర్లు, విభాగాల అధ్యక్షులు, బాధ్యులు, కార్యకర్తలు, కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top