కోదాడలో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి..

Spread the love

కోదాడలో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి….
ఆ మహనీయునికి ఘన నివాళి..
సూర్యాపేట జిల్లా//కోదాడ/
భారత దేశ శాస్త్ర సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. కలాం వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణం గాంధీ పార్క్ లో ఉన్న కలాం విగ్రహానికి స్వర్ణ భారతి ట్రస్ట్ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి తొలి మిస్సైల్ ను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎక్కడో పేద కుటుంబంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులును సంపాదించుకున్నారని అన్నారు. నేటి యువత కలం ను ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన బాటలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చీఫ్ అడ్వైసర్ పైడిమర్రి సత్యబాబు, గరిణే శ్రీధర్, రాయపూడి వెంకటనారాయణ, వెంపటి వెంకటరమణ, దేవరశెట్టి శంకర్రావు , చిట్టిప్రోలు నారాయణ, గుడుగుంట్ల సాయి, వెంపటి ప్రసాద్, కిట్స్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top