
భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి మహోత్సవం
వందల మందికి పైగా అన్న ప్రసాదాలు
ఉభయ నైవేద్యాలు సమర్పించుకున్న లేబూరు సుధాకర్ రెడ్డి, లక్ష్మీప్రసన్న దంపతులు
శ్రీ కృష్ణ సాయి మందిరం నందు గురు పౌర్ణమి మహోత్సవం లేవూరు సుధాకర్ రెడ్డి, లక్ష్మీప్రసన్న దంపతుల పర్యవేక్షణలో పూజారి సమక్షంలో ఆ సాయినాధునికి పరిమళ పుష్పాలతో, మంగళ హారతులతో, పండితుల మంత్రోచ్ఛారణతో సాంప్రదాయబద్ధంగా జరిగాయి. అనంతరం అన్న ప్రసాదాలు రామి రెడ్డి గజేందర్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు రామిరెడ్డి సోదరులు ఆధ్వర్యంలో నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు లేబూరు రాధాకృష్ణారెడ్డి, కౌసల్యమ్మ దంపతులు దీన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి ఈ దేవస్థానం నందు ఎవరికి ఏ కార్యక్రమాలు కావాలన్నా జరిపించుకోవచ్చు దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి,రామిరెడ్డి మధుసూదన్ రెడ్డి,శివుని నరసింహులు రెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, కవరగిరి ప్రసాద్, వందలాది భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
