
ప్రత్యేక ఓటర్ల సవరణ (SIR)లో వివరాలను నమోదు చేసుకున్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వారి సొంత గ్రామం గాజులరామారం లో ఓటరు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి సంబంధిత బిఎల్వో (BLOS) అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిస్తూ, ప్రతి ఓటరు తమ ఓటరు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో సక్రమంగా నింపి, సంబంధిత అధికారులకు అందజేయాలని కోరారు.
అలాగే, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ ఓటరు వివరాలను నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ విజ్ఞప్తి చేశారు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
