
రామగుండం ఎన్‌టీపీసీ సిఎస్‌ఆర్ మరో సేవ…..
ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.43.50 లక్షల విలువైన రెండు అంబులెన్స్‌లు అందజేత….
గోదావరిఖని, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్‌టీపీసీ రామగుండం గోదావరిఖని, పెద్దపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులకు మొత్తం రూ.43.50 లక్షల విలువైన రెండు అత్యాధునిక అంబులెన్స్‌లను అందజేసింది.
ఈ అంబులెన్స్‌లను ఎన్‌టీపీసీ రామగుండం కార్యనిర్వాహక సంచాలకుడు (రామగుండం & తెలంగాణ) శ్రీ చందన్ కుమార్ సమంతా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీపీసీ జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాల అధిపతులు, కార్మిక సంఘాలు, అసోసియేషన్ ప్రతినిధులు, మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగం సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎన్‌టీపీసీ అందజేసిన అంబులెన్స్‌లు ప్రాంతీయ అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను సకాలంలో ఆస్పత్రులకు తరలించడంలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వేగంగా వైద్య సేవలు అందించడంలో, స్పందన సమయాన్ని తగ్గించడంలో, ప్రభుత్వ ఆస్పత్రుల ఆరోగ్య సేవల సామర్థ్యాన్ని పెంచడంలో ఈ అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ప్రజారోగ్య సేవలను మెరుగుపరచడం, స్థానిక సమాజ సంక్షేమానికి తోడ్పడడం ఎన్‌టీపీసీ రామగుండం సీఎస్‌ఆర్ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని, తమ కార్యకలాపాల పరిధిలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించేందుకు సంస్థ నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని అధికారులు తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
