తలసేమియా చిన్నారులకు ఎమ్మెల్యే KR నాగరాజు భరోసా…

TEJA NEWS

తలసేమియా చిన్నారులకు ఎమ్మెల్యే KR నాగరాజు భరోసా…

తలసేమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అండగా నిలిచారు.సోమవారం జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ తో కలిసి హనుమకొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో తలసీమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.తలసేమియా చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉంటుందని, ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడటానికి రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.వర్ధన్నపేట నియోజకవర్గంలో అనేక సార్లు రక్తదాన శిబిరాలను నిర్వహించామన్నారు.

ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్,డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి , టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఇవి శ్రీనివాస్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top