అధికారులు ప్రజా సమస్యలు తెలుసుకొని ఇబ్బందులు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే KR నాగరాజు

TEJA NEWS

అధికారులు ప్రజా సమస్యలు తెలుసుకొని ఇబ్బందులు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే KR నాగరాజు …

అధికారులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు.గురువారం గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ లోని పలు కాలనీలో ఉన్న సమస్యలపై వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న తో,అధికారులతో కాలనీల ప్రెసిడెంట్ లతో మున్సిపాలిటీ కాన్ఫరెన్స్ హలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. కాలనీలలో తాగునీటి సమస్య ఎదురవుతుందని అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యక్తంగా ఉందని, కాలనీ వాసుల వివరించిన సమస్యలను పరిష్కరించి అధికారులను చర్యలు తీసుకోవాలని సూచించారు.కాలనీలలో అవసరమైన చోట్ల వీధిలైట్లు,స్మశాన వాటికల వద్ద నీటి సరఫరా తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.అధికారులు, వివిధ శాఖలతో అధికారులతో కలిసి ఒకరికోకరు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ అధ్యక్షులు ఇంతియాజ్, కాలనీలాల అధ్యక్షులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top