
మహాత్మ జ్యోతి పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్ కళాశాలలలో ఘనంగా ఫ్రెషర్స్ డే
విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని
క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలోని మహాత్మ జ్యోతి పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా మరియు సృజనాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.
ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల అభివృద్ధికి అన్ని విధాల పాటుపడతానని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కళాశాల సిబ్బంది ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ ప్రణయ సమన్వయ అధికారి ఈ స్వప్న, కాలేజీ ప్రిన్సిపాల్ కే.శోభారాణి, నేరేడుచర్ల ప్రిన్సిపల్ ఎం .శ్రీనివాస్, ఆత్మకూరు ప్రిన్సిపాల్ జ.వెంకటేశ్వర్లు, చిలుకూరు ప్రిన్సిపాల్ సిహెచ్ .వీరయ్య స్టాఫ్ ఏ .నరేష్, పి గోపాలకృష్ణ, బి.సురేష్, జి ఆదినారాయణ, ఎం శ్రీను, ఎం. రవీందర్, డి. జ్యోతి, మహమ్మ ఫిర్దోజ్ హెల్త్ సూపర్వైజర్ కే నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
