
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: ఎమ్మెల్యే KR నాగరాజు …
వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, బూత్ స్థాయి ప్రతినిధులకు ఓటర్ల జాబితా విషయంలో అప్రమత్తంగా ఉండాలని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మామునూరులోని HRS ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పునఃసమీక్షలో రాష్ట్ర అధికార ప్రతినిధి రవళి రెడ్డి ,వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ , తెలంగాణ కోఆర్డినేటర్ నాసర్ దిశా నిర్దేశం చేశారు.
వారు మాట్లాడుతూ…ఓట్ల గల్లంతు కాకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.ముఖ్యంగా వలస వెళ్లిన కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు తొలగింపునకు గురయ్యే అవకాశాలు ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ లు ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ స్థాయి నుంచే ఓటు హక్కును పరిరక్షించే బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలలో మార్పుల కొరకు ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి సవరణ చేయాలని కోరారు.కొత్త ఓటరు జాబితాలో మార్పుల కొరకు స్క్రీన్ మీద అవగాహ కల్పించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు,నాయకులు,బూత్ లెవెల్ ఏజెంట్లు,తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
