ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ ఫేజ్ 2 లో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును జాబితాలో చెర్పించాలి

Spread the love

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ ఫేజ్ 2 లో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును జాబితాలో చెర్పించాలి…

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కోనకయ్య గారు,ఇల్లందు నియోజకవర్గ సర్ కో.ఆర్డినేటర్ రాయల నాగేశ్వరరావు…

… ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (సర్) ప్రక్రియ రెండో విడత (ఫేజ్ 2) కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ లు అప్రమత్తంగా ఉండాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కోనకయ్య గారు,ఇల్లందు నియోజకవర్గ సర్ కో-ఆర్డినేటర్ రాయల నాగేశ్వరరావు అన్నారు…సర్ ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా ఈనెల 27వ తేదీన అన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డు లలో ప్రభుత్వంచే గ్రామ సభలు నిర్వహించబడుతున్నాయని అన్నారు..ఈ గ్రామ సభలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ లు ఖచ్చితంగా హాజరుకావాలని కోరారు…అదేవిధంగా బీఎల్ఓ లు ఇచ్చే లిస్ట్ లో డిజిటలైజేషన్ కానివి,అప్రూవల్ అయిన ఓటరు లిస్టులు సపరేటుగా ఇస్తారు.. అదేవిధంగా ఓటర్లకు నోటిసులు ఇచ్చిన వాటిని,ఆధారాలు చూపించి,ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా చూడాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కోనకయ్య గారు,ఇల్లందు నియోజకవర్గ సర్ కో-ఆర్డినేటర్ రాయల నాగేశ్వరరావు కోరారు..ఈ విషయాన్ని బీఎల్ఏ లు సీరియస్ గా తీసుకుని,తప్పకుండా గ్రామ సభలో పాల్గోని బీఎల్ఓ లు చెప్పే ప్రతి విషయాన్ని,నోటీసులు పరీశీలించాలని సూచించారు..

You cannot copy content of this page

Scroll to Top