ఘనంగా జరిగిన శ్రీ సరస్వతీ మాత ఆలయ వార్షికోత్సవం…

Spread the love

ఘనంగా జరిగిన శ్రీ సరస్వతీ మాత ఆలయ వార్షికోత్సవం….

నూతన తరగతి గదుల ప్రారంభం, శ్రీ గాయత్రీ హోమం నిర్వహణ…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : జవహర్‌నగర్‌లోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో శ్రీ సరస్వతీ మాత ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన నాలుగు తరగతి గదులను ప్రారంభించిన అనంతరం శ్రీ గాయత్రీ హోమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం విభాగ్ అధ్యక్షులు డా. విష్ణువర్ధన్ రావు, విభాగ్ కార్యదర్శి దహెగాం గోవిందరావు, విభాగ్ సహ కార్యదర్శి, పూర్వ విద్యార్థి పరిషత్ బాధ్యులు గుండం అశోక్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాల అభివృద్ధిలో స్థానిక బాధ్యులు, దాతలు అందిస్తున్న సహకారాన్ని వారు కొనియాడారు.

ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను సన్మానించి, వారి పేర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ పూదరి సత్యనారాయణ, పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షులు శివ నారాయణ బంగ్, సమితి ఉపాధ్యక్షులు రాచమళ్ల జనార్దన్, డా. భగవాన్ రెడ్డి, గంధం రవీందర్, పడాల సత్యనారాయణ, నలుమాస్ సత్తయ్య, బస్వాపతుల శ్రీనివాస్, ఇసంపల్లి వెంకన్న, వేపురి రామన్న, మంతెన శ్రీనివాస్, ప్రధానాచార్యులు సుమాంజలి, విభాగ్ ఆడిటర్ పెంటయ్యతో పాటు హితైషులు, పుర ప్రముఖులు, మాతాజీలు, పోషకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అనంతరం భక్తులు, విద్యార్థులు, అతిథులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు

You cannot copy content of this page

Scroll to Top