రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ కి రాఖీలు కట్టిన మహిళలు సోదరీమణులు

Spread the love

రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ కి రాఖీలు కట్టిన మహిళలు సోదరీమణులు

షాపూర్ నగర్: రాఖీ పౌర్ణమి సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ తో పాటు వారి సోదరుడు మేడ్చల్ మల్కాజిగిరి డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ కి నియోజకవర్గానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో షాపూర్ నగర్‌లోని వారి నివాసానికి విచ్చేసి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ కి మరియు వారి సోదరుడు శ్రీనివాస్ గౌడ్ కి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాఖీలు కట్టడం పట్ల కూన శ్రీశైలం గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. మహిళల అభిమానం, ఆప్యాయత తనకు ఎప్పటికీ ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు.అన్నాచెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, బాధ్యతలకు రక్షాబంధన్ పండుగ సాక్ష్యంగా నిలుస్తుంది అన్నారు,సమాజంలో మహిళలకు ప్రతి ఒక్కరు మర్యాదలు ఇవ్వాలని, సమాజంలో మహిళల పాత్ర కీలకమన్నారు, ప్రతి ఒక్కరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళలు పద్మ , లావణ్య, శ్యామల, సంగీత, అనిత, లతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top