
చందన అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్న భక్తలు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మూడవ శ్రావణ శుక్రవారం సందర్భంగా చందనం అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ వాసవి అమ్మవారు.పూజారి నందకిషోర్ పర్యవేక్షణలో సాంప్రదాయ బద్ధంగా, పరిమళ పుష్పాలతో, వేద పండితుల మంత్రోచ్ఛారణతో, చందనం అలంకరణలో ఉన్న అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ‘ఉదయకర్తలుగా పచ్చి పులుసు రాజా వెంకట సురేష్ లక్ష్మీ మాధవి దంపతులు’ ఉభయ నైవేద్యాలు భయ భక్తులతో సమర్పించుకున్నారు. చందనం అలంకరణలో కనుల విందుగా కనిపించిన శ్రీ వాసవి మాతను దర్శించుకుని, అమ్మవారి కృపాకటాక్షం పొందారు. అనంతరం అమ్మవారికి మంగళ వాయిద్యాలతో జై వాసవి మాత నినాదాలతో పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ సి.హెచ్ వెంకటేశ్వర్లు, సెక్రటరీ యస్. రమేష్ బాబు, కోశాధికారి మెంటా రమేష్ బాబు, ఆర్యవైశ్య భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
