
శిరీష ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ
పాల్గొన్న MLA జారే
ములకలపల్లి
శిరీష ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ ములకలపల్లి మండలంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శిరీష చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కడినుండి ప్రారంభమైన కొవ్వొత్తుల ర్యాలీ పాత పోలీస్ స్టేషన్ మీదుగా తిరిగి ములకలపల్లి సెంటర్ కు చేరుకుంది
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, శిరీష మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి .ములకలపల్లి మండల చెందిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని శిరీష కు ఘన నివాళులు అర్పించారు. “శిరీష ఆత్మకు శాంతి చేకూరాలి రెండు నిమిషాలు మౌనం పాటించారు… ఆమె కుటుంబానికి మనోధైర్యం కలగాలి” అంటూ ప్రార్థించారు.
ఈ కార్యక్రమం ములకలపల్లి మండల ప్రజల ఐక్యతను, మానవతా విలువలను చాటిచెప్పేలా సాగింది అనంతరం క్రీస్తు ప్రార్ధనతో ముస్లిం ప్రార్థనలతో హిందూ ధార్మికతతో పలువురు శిరీషకు నివాళులు అర్పించారు కార్యక్రమంలో ములకలపల్లి సర్పంచ్ కొర్సా చంద్రలేఖ జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ సీతారాంపురం సర్పంచ్ కుంజా రవి చౌటిగూడెం సర్పంచ్ ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి జహీరుద్దీన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ మాజీ పిఎసియస్ ఛైర్మన్ కరుటూరి కృష్ణ మాజీ రైసస అధ్యక్షుడు నాగళ్ళ వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్ లు కారం సుధీర్ భుక్యా పత్తిలాల్ కీసరి శ్రీను మాజీ ఉప సర్పంచ్ శనగపాటి అంజి అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్ కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షుడు సోయం నాగరాజు గుడ్ షెప్పర్డ్ సిస్టర్ దీప్తి మరియు మహిళలు చౌటిగూడెం గ్రామస్తులు ఆదివాసి సంఘం మాల మహానాడు సంఘం నాయకులు మండల ప్రముఖులు మీడియా మిత్రులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
