చిలుకూరులో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం

Spread the love

చిలుకూరులో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం…

సూర్యాపేట జిల్లా/ చిలుకూరు: కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు వైఫల్యంపై కోదాడలో చేపట్టే బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కినపల్లి జానకీరామాచారీ కోరారు. చిలుకూరులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో మాట్లాడారు. అమలకు నోచుకోని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. మండలం నుండి భారీగా పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, బీఆర్ఎస్ నాయకులు తాళ్ళూరి శ్రీను, అంబాల వెంకటి, షేక్ పాషా, అమరగాని లింగరాజు, మాదవరపు శ్రీను, షాకీర్, దొడ్డా శ్రీను, మాదాసు రాజు, కోటేష్, సిద్దెల పిచ్చయ్య, అలసకాని సైదయ్య, బండి కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top