కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి – కాంగ్రెస్ పార్టీ

Spread the love

కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి – కాంగ్రెస్ పార్టీ ||

ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున నిలబడటంలో విఫలమైన కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ నిరసన కార్యక్రమాన్ని నిజాంపేట్ సర్కిల్‌లో నిర్వహించారు. బాచుపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా నిజాంపేట్ సర్కిల్‌కు చేరుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైందని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top