
ద్వారకానగర్ మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని 284వ డివిజన్ గణేష్ నగర్‌లోని ద్వారకానగర్‌లో మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి . దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో రూ.21.50 లక్షల నిధులు మంజూరు కాగా, ఈ నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీల సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మల్టీపర్పస్ హాల్ నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కే.ఎం. గౌరీష్ , డివిజన్ అధ్యక్షులు, వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
