సెప్టెంబర్‌ 6న.ఏఐటీయూసీ భారీ బహిరంగ సభకు తరలిరండి…..

Spread the love

సెప్టెంబర్‌ 6న.ఏఐటీయూసీ భారీ బహిరంగ సభకు తరలిరండి…..

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దాం: కడారి సునీల్‌…..

ఎన్‌టీపీసీ నంబర్‌-2 గేట్‌ వద్ద ఏఐటీయూసీ మహాసభల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్‌ తెలిపారు. మహాసభల సందర్భంగా సెప్టెంబర్‌ 6న నిర్వహించనున్న భారీ కార్మిక ప్రదర్శన, బహిరంగ సభకు కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఎన్‌టీపీసీ నంబర్‌-2 గేట్‌ ఎదుట కడారి సునీల్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటాలు, విప్లవ ఉద్యమాలకు కరీంనగర్‌ గడ్డ చారిత్రకంగా ఊపిరిపోసిందని, అలాంటి ప్రాంతంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలు నిర్వహించడం విశేషమన్నారు.
సెప్టెంబర్‌ 6న అంబేద్కర్‌ స్టేడియం నుంచి సర్కస్‌ గ్రౌండ్‌ వరకు భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించి అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌తో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరుకానున్నారని వెల్లడించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

మహాసభల్లో గతకాలపు కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు భవిష్యత్‌లో చేపట్టాల్సిన పోరాటాలు, కార్మిక ఉద్యమాల కార్యాచరణపై విస్తృతంగా చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించనున్నట్లు కడారి సునీల్‌ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు నాంసాని శంకర్‌, జిల్లా కోశాధికారి రెడ్డపాక లక్ష్మణ్‌, రామగుండం నగర అధ్యక్షుడు అబ్దుల్‌ కరీం, కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top