
హామీల అమలేది…? కాంగ్రెస్ సర్కారును నిలదీసిన బీజేపీ…
6 గ్యారెంటీలు.. బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో 420 హామీల అమలుపై ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు…
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, వివిధ డిక్లరేషన్లను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య నేతృత్వంలో రామగుండం ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా 39వ. డివిజన్ కార్పొరేటర్ తిప్పారపు మానస-శరత్, 52వ. డివిజన్ కార్పొరేటర్ చిదురాల నాగరాజులకు బీజేపీ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు.
కార్యక్రమంలో సోమారపు లావణ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. హామీల పేరుతో ప్రజల నుంచి ఓట్లు పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాతంగి రేణుక, బూడిద రమేష్, పంగ రవి, అరిగెల శ్రావణ్, మెరుగు శ్రీనివాస్, మహేష్, శివ, శ్రీనివాస్, భాగ్యశ్రీ, మేడి రాజు తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
