
కాపుగల్లు గ్రామంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు..
సూర్యాపేట జిల్లా/ కోదాడ: త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానం ఆచరణీయం
మనుషులందరూ త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానం చదివి తెలుసుకొని ఆచరించుటకు వీలుగా ఉన్నదని ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ సభ్యులు పేర్కొన్నారు. కాపుగల్లు గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం ఆవరణలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ సభ్యులు మాట్లాడుతూ భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలకు ఇప్పటి వరకు 330 మందికి పైగా స్వామీజీలు పలు భాషల్లో వివరణ వ్రాశారని, ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వివరణ వ్రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రతి మనిషి చదివి దేవుని జ్ఞానం తెలుసుకొని ఆచరించేందుకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రెండో మనిషి అవసరం లేకుండానే చదివి అర్ధం చేసుకునేలా తీర్చిదిద్దబడిందన్నారు. త్రైత సిద్ధాంత భగవద్గీత శ్రీకృష్ణుడి నిజభావాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. శ్రీకృష్ణ ప్రతిమను పల్లకీలో ఏర్పాటుచేసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. స్థానిక యాదవులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
