
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా “వంటా వార్పు”
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “వంటా వార్పు” నిరసన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
వంపుగూడ లో నిర్వహించిన వంటా వార్పు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
మహిళలకు నెలకు ₹2,500, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలలో తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
