
అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి….
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రతినిధుల ప్రధాన బాధ్యత….
– ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, అంతర్గాం/సెప్టెంబర్ 04: మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సూచించారు. అంతర్గాం మండల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే చర్చించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి వాటికి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను సూచించారు.
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని రాజ్ ఠాకూర్ అన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన రహదారులు, తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ అధికారులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
