బోసు బొమ్మ సెంటర్ నందు’ఇంటింటికీ తెలుగుదేశం’

Spread the love

బోసు బొమ్మ సెంటర్ నందు’ఇంటింటికీ తెలుగుదేశం’

– ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ

వినుకొండ పట్టణం 18 వ వార్డు బోసు బొమ్మ సెంటర్ నందు ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచారo లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని,వార్డ్ లో ఇంటింటికీ తిరిగి ప్రజలతో మాట్లాడారు. జీవీ మాట్లాడుతూ… రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరంగా వివరించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top