
తాటి బెల్లం కాఫీ ప్రారంభం
ECILలో తాటి బెల్లం కాఫీని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
ECIL ప్రాంతంలో “తాటి బెల్లం కాఫీ – ఆరోగ్యానికి ఆరంభం” పేరుతో ఏర్పాటు చేసిన కాఫీ కేంద్రాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన కాఫీని రుచి చూసి నిర్వాహకులను అభినందించారు.
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసే ఆహార, పానీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానికంగా కొత్త వ్యాపారాలను ప్రారంభించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా అభినందనీయమన్నారు.
తాటిబెల్లరి కాఫీ ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని అందించాలనే ప్రయత్నం చేస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. సంస్థ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
