
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట..
చందనగర్ లో భారీ నిరసన!
- అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 420 హామీలను అమలు చేస్తామని గొప్పలు చెప్పి, వెయ్యి రోజులు గడిచినా ప్రజలను నిలువునా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ (BRS) పార్టీ పోరుబాట పట్టింది. కే. టీ. ఆర్ గారి ఆదేశాల మేరకు,కృష్ణారావు గారు మరియు శంబిపూర్ రాజు గారి సూచన మేరకు,బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు సాయి బాబా,రంగా రావు,కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి,మల్లికార్జున్ శర్మ,శ్రీకాంత్ తో కలిసి భారీ నిరసన కార్యక్రమం చేయడం జరిగినది.
గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దళితులకు రూ.10 లక్షల దళితబంధు పథకాన్ని అందిస్తే.. తాము అధికారంలోకి వస్తే ఏకంగా రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పింది. కానీ నేటికీ ఆ హామీని అమలు చేయకుండా దళితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ మోసానికి గురిచేసింది. కేవలం దళితబంధు మాత్రమే కాకుండా, ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన అనేక ప్రధాన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అమలుకు నోచుకోని కాంగ్రెస్ ప్రధాన హామీలు:
వృద్దులకు 4000 పెన్షన్,వికలాంగులకు 6000 పెన్షన్
మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామన్న హామీ నేటికీ అమలు కాలేదు.
రైతు రుణమాఫీ:
రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక అనేక ఆంక్షలు విధించి లక్షలాది మంది రైతులను మోసం చేశారు.అధిక
రైతు భరోసా:
రైతులకు ఎకరాకు ఏటా రూ.15,000 చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామన్న మాట అటకెక్కింది.
నిరుద్యోగ భృతి & స్కూటీలు:
నిరుద్యోగ యువతకు నెలవారీ భృతి చెల్లిస్తామని, అలాగే చదువుకునే యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్న హామీలు బుట్టదాఖలయ్యాయి.
తులం బంగారం:
ఆడబిడ్డల వివాహాలకు లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని ప్రభుత్వం పూర్తిగా విస్మరించి ఇప్పుడు కల్యాణ లక్ష్మిని,షాది ముబారక్ ని కూడా ఎత్తి వేసింది.
ప్రజల హక్కుల కోసం, ఇచ్చిన హామీల సాధన కోసం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉంటుందని బొబ్బా నవతా రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు,కార్యకర్తలు,ఉద్యమకారులు,మహిళలు,పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
