
ఉద్యోగ విరమణ పొందిన హోం గార్డులకు ఆత్మీయ వీడ్కోలు…
35 ఏళ్ల సేవలకు పోలీస్ శాఖ ఘన సత్కారం…
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి, రామగుండం/
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 35 సంవత్సరాల పాటు హోం గార్డులుగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న జె. రామయ్య, పి. సత్తయ్యలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పరిధిలో హోం గార్డు నంబర్ 256గా విధులు నిర్వహించిన జె. రామయ్య, గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా పరిధిలో హోం గార్డు నంబర్ 249గా సేవలందించిన పి. సత్తయ్యలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఘనంగా సత్కరించారు. వారికి పూలమాలలు వేసి, శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ పోలీస్ శాఖలో దీర్ఘకాలం నిబద్ధతతో సేవలందించిన హోం గార్డుల సేవలను అభినందించారు. ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, హోం గార్డ్స్ ఆర్ఐ పెద్దన్న, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఎం. తిరుపతి, ప్రధాన కార్యదర్శి జె. అంజనేయులు, సంయుక్త కార్యదర్శి కె. ఓంకార్, సంఘం సభ్యులు, హోం గార్డ్స్ ఇన్చార్జీలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
