1000 రోజులైనా 6 గ్యారంటీలు, 420 హామీల సంగతేంటి

Spread the love

1000 రోజులైనా 6 గ్యారంటీలు, 420 హామీల సంగతేంటి?

నిజాంపేట్ ప్రజావాణిలో ఫిర్యాదుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు

నిజాంపేట్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నారు.

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణిలో NMC మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు అధికారులకు వినతిపత్రం సమర్పించనున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరు గ్యారంటీలను అర్హులందరికీ అమలు చేయడంతో పాటు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన *420 హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు.

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top