RGK 1-14 మరియు సుందర్ నగర్ UGD సమస్య – GM కి వినతి

Spread the love

RGK 1-14 మరియు సుందర్ నగర్ UGD సమస్య – GM కి వినతి

292 డివిజన్ సాయిబాబా నగర్ RGK 1 నుండి 14 వరకు మరియు సుందర్ నగర్ లో UGD సమస్య చాలా రోజుల నుండి తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమస్యను స్వయంగా BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ పాదయాత్ర చేసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో క్షేత్రస్థాయిలో తెలుసుకుని అధికారులతో మాట్లాడటం జరిగింది.

ఈ సమస్యను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే K.P. వివేకానంద గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఎమ్మెల్యే వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యను తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే K.P. వివేకానంద గౌడ్ సూచన మేరకు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ శ్రీమతి మాధవి మేడమ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్, జై సింహా రెడ్డి, బద్రి, జహీర్ తదితరులు పాల్గొని సమస్య తీవ్రతను వివరించారు.

You cannot copy content of this page

Scroll to Top