
జపాన్ విజిట్ పూర్తి చేసుకున్న టీచర్ రాజశేఖర్‌కు ప్రశంసలు….
సూర్యపేట జిల్లా /కోదాడ:
ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్‌కు డీఈఓ ప్రశంసలు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున జపాన్ ఎక్స్‌పోజర్ విజిట్ కి వెళ్ళి పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సూర్యాపేట జిల్లా ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్‌ను గురువారం జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ వారి కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
సెప్టెంబర్ 5 నుండి 12 వరకు జరిగిన ఈ అధ్యయన పర్యటనలో జపాన్‌లోని విద్యావిధానం, పాఠశాలల్లో ఐసీటీ వినియోగం, విద్యార్థుల్లో స్వీయ శుభ్రత పాటించే పద్ధతులు మరియు నూతన విద్యా దృక్పథాలను రాజశేఖర్ క్షుణ్ణంగా పరిశీలించారు. పర్యటన వివరాలను డీఈఓకు వివరించగా, ఆయన రాజశేఖర్ సాధించిన గుర్తింపును ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మారం పవిత్ర, తాళ్లూరి సాయి ఈశ్వరి, చారుగుండ్ల రాజశేఖర్‌లు కలిసి డీఈఓ అశోక్‌ను ఘనంగా సత్కరించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
