హరితవనం కాలనీలో ₹50 లక్షలతో రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం

Spread the love

హరితవనం కాలనీలో ₹50 లక్షలతో రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం ||

కుత్బుల్లాపూర్: హరితవనం కాలనీ, KRCR ఆర్కేడ్ / హరితవనం కమాన్ వద్ద CMC నిధుల ద్వారా మంజూరైన ₹50 లక్షల రోడ్డు అభివృద్ధి పనులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు మెరుగైన రహదారులు మరియు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.కాలనీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, మైనారిటీ నాయకులు సయ్యద్ షఫీ, కాలనీ సభ్యులు సందీప్ వర్మ, సురేష్ నాయుడు, శివకృష్ణ, విక్రమ్ రెడ్డి, నవరాజు, నాగరాజు, కోటయ్య నాయక్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top