
నూతన కాలనీ అసోసియేషన్ కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
9వ ఫేజ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస రావు అభినందించారు.
కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కు నూతనంగా ఎన్నికైన సభ్యులు అధ్యక్షులుగా చెల్లుబోయిన రమేష్, వైస్ ప్రెసిడెంట్ బ్రిజేష్, వెంకటరత్నం, వెంకటరెడ్డి, జనరల్ సెక్రెటరీ సిహెచ్ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ యు రాంగోపాల్, విజయ్ కుమార్ రాజు, సీతారామరాజు, లీగల్ అడ్వైజర్ జి మీనాక్షి, ఆర్గనైజింగ్ సెక్రటరీ హనుమంతరావు, ట్రెజరర్ బ్రహ్మారెడ్డి, కల్చరల్ సెక్రెటరీ వెంకట్ రాజు, మెంబర్స్ విశాలి, రమణ, కృష్ణారెడ్డి, ప్రసాద్ నాయక్, జి శ్రీనివాస్, చంద్రమౌళి, ఎస్ శ్రీనివాస్ రావు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాలనీ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు, నివాసితుల సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. కాలనీ సంక్షేమం, అభివృద్ధి కోసం అసోసియేషన్ సభ్యులు ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు…
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు….
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
