
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహేష్‌కు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు…
పున్నెలు గ్రామానికి చెందిన మహేష్ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం
వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన గుడికందుల మహేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరంగల్ మార్చురీ వద్ద మహేష్ భౌతికకాయాన్ని హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్ తో కలిసి సందర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పూలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహేష్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధిత కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. మహేష్ మృతి పున్నెలు గ్రామంలో విషాదాన్ని నింపిందని, మృతుడి కుటుంబానికి ఈ లోటు తీరనిదని పేర్కొన్నారు. మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రార్థించారు. వారి వెంట జిల్లా జెబిఎం చైర్మెన్ జన్నపురెడ్డి రుగ్విద్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు కత్తి సుధీర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు రాజయ్య, వార్డు మెంబర్లు చెన్నూరి రవి, చిన్ని, నాయకులు రాయపురం సాంబయ్య, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
