పవిత్ర రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో సీనియర్ నాయకులు సల్లావుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సీనియర్ నాయకులు గణేష్ ముదిరాజు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం చాలా అభినదించదగ్గ విషయం అని అదేవిధంగా తెలంగాణకు ప్రత్యేకమైన “గంగా జమునా తెహజీబ్” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని PAC చైర్మన్ గాంధీ అభిలషించారు. రంజాన్ మాసం ఉపవాసం తో మంచి తనం ,సంస్కారం అలవడుతుందని ,మతసామరస్యానికి ప్రతీక ,అందరూ కల్సి ఉండాలని , అదేవిధంగా కుల మతం జాతి భేదం లేకుండా తెలంగాణ జాతి అంతా ఒకటే అని , ఆ దేవుడి కరుణకటాక్షాలు పొందేందుకు దేవుడి కృపకు దగ్గర కాగలమనేది ప్రతి ముస్లిం సోదరుల ప్రగాఢ విశ్వాసము అందుకే ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ నెల మాసాన్ని పురస్కరించుకుని నియమ నిబంధనలు పాటించి ఉపవాస కఠోర దీక్షతో ప్రార్థనలు చేస్తారు. ఈ విధమైన ఆధ్యాత్మిక దైవ ప్రార్ధనలతో శాంతి, సోదరభావం, సౌభ్రాతృత్వానికి రంజాన్ ప్రతీక అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్ ముదిరాజ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సల్లావుద్దీన్, ఇమ్రాన్ మరియు కార్యకర్తలు, ముస్లిం సోదరులు, మహిళ సోదరీమణులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
