ప్రభుత్వ స్కూల్ లను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాల్సి ఉందని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. దూద్ బావి లోని చిలకలగుడా ప్రైమరీ స్కూల్ లో రానున్న విద్యా సంవత్సరానికి ప్రవేశాల కరపత్రాలను పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్ ల లో వివిధ సదుపాయాలను కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, సికింద్రాబాద్ లో పేద విద్యార్ధులకు ఉపకరించేలా జూనియర్, డిగ్రీ కాలేజీ లను సాధించుకున్నామని తెలిపారు. కొత్త భవనాల నిర్మాణానికి సైతం చురుకుగా ఏర్పాట్లు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సైతం తమ స్కూల్ లలో విద్యార్ధుల సంఖ్యను పెంచుకొనేందుకు, మెరుగైన ప్రమాణాలకు కృషి చేయాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
