
స్వేరోస్ డివిజన్ అధ్యక్షుడిగా వట్టేపు కిషోర్
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆర్ & బి గెస్ట్ హౌస్ లో స్వేరోస్ రాష్ట్ర, జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కల్వకుర్తి మండలం మార్చాల గ్రామానికి చెందిన వట్టేపు కిషోర్ ను కల్వకుర్తి డివిజన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు,ఈ సందర్భంగా వట్టేపు కిషోర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో డివిజన్ అధ్యక్షుడిగా నియమించిన స్వేరోస్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇచ్చిన పదవిని తూచా తప్పకుండా పాటిస్తూ ,మహనీయుల ఆశయాలను కొనసాగిస్తు, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం,పెద విద్యార్థులను అక్షరమే ఆయుధంగా ముందుకు సాగుతూ సమాజంలో ఎదగాలని నిరంతరం శ్రమిస్తున్న ప్రవీణ్ కుమార్ సార్ అడుగుజాడల్లో నడుస్తాని తెలుపడం జరిగింది,ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర నాయకులు అశ్విన్ కుమార్, రాష్ట్ర నాయకులు దుబ్బ నగేష్, నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల రమేష్, స్వేరస్ సీనియర్ నాయకులు జంగిలి నిరంజన్ , జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్, సోషల్ మీడియా ఇంచార్జ్ సంపత్ కుమార్, వంగూరు మండల అధ్యక్షులు దార్ల కసన్న, కల్వకుర్తి పట్టణానికి స్వేరోస్ ఇంచార్జ్ నిరటి మల్లేశ్, మబ్బు బాను ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
