ఓపెన్ నాలా డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 ఆల్విన్ కాలనీ డివిజిన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తత్రయ కాలనీ నుండి ఎల్లమ్మ చెరువు వరకు ఉన్న ఓపెన్ నాలా పూడిక తీత (డీసిల్టింగ్) పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎఇ శ్రావణి తో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఓపెన్ నాలా పూడికతీత పనులను మాన్సూన్ కు ముందుగానే పూర్తిచేస్తామని అన్నారు. వేసవి కాలంలోనే పనులు పూర్తిచేస్తే వర్షాకాలంలో వచ్చే వరద నీరు అంతా సజావుగా దిగువకు వెళ్ళిపోతుంది కాబట్టి లోతట్టు ప్రాంతలవారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు. పూడికతీత పనులు సకాలంలో పూర్తి చేసి వరద నీరుతో కాలనీలు ముంపుకు గురవ్వకుండా చూడాలని అధికారులకు సూచించారు. రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, జి.ఎచ్.ఎం.సి అధికారులు మరియు మాన్ సున్ ఎమర్జెన్సీ టీమ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండ చూడలని తెలియచేసారు. కార్యక్రమంలో గుడ్ల శ్రీనివాస్, జగదీష్, పోశెట్టిగౌడ్, రవీందర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, జి.ఎచ్.ఎం.సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
