ఆత్మీయ స్నేహితుల అ”పూర్వ” కలయిక!
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ తిరుపతి అన్నమయ్య జిల్లాల ఇన్ చార్జ్ గునిపాటి దీపక్ రెడ్డి శుక్రవారం తిరుపతిలోని బిజెపి నేత, ఆత్మీయ స్నేహితులు పి.నవీన్ కుమార్ రెడ్డి స్వగృహానికి విచ్చేసి నవీన్ మాతృమూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తన సంతాపాన్ని తెలియజేస్తూ ఘన నివాళులర్పించారు. వ్యక్తిగత పనుల కారణంగా శుభ స్వీకరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని
నవీన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని గునిపాటి దీపక్ రెడ్డి తెలిపారు. అలాగే
తిరుపతి నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని తెలిపారు.
కూటమి నేతలు ఏపి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రజాహిత కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై, నాయకులపై ఉందన్నారు. దీపక్ రెడ్డి సుమారు రెండు గంటల పాటు నవీన్ నివాసంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి చేపట్టబోతున్న ప్రజా రంజకమైన కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో నవీన్ సోదరులు టిడిపి నేత, మాజీ కో- ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ భువన కుమార్ రెడ్డి, శాప్ చైర్మన్ రవి నాయుడు, డిప్యూటీ మేయర్ ఆర్. సి. మునికృష్ణ, కోడూరు బాలసుబ్రమణ్యం, మాజీ బ్యాంక్ డైరెక్టర్లు బాలసుబ్రమణ్యం రెడ్డి, ఆనంద్ యాదవ్, ముని రామయ్య,
నాయకులు కృష్ణ యాదవ్, బుల్లెట్ రమణ, మధు, ఆనంద్ గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
