వనపర్తి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోటీ చేసే అభ్యర్థులు బుధవారం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు శెట్టి ఓ ప్రకటనలో తెలిపారు ఈ మేరకు నామినేషన్ల స్వీకరణ ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుందని అభ్యర్థులు 5000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ఆర్యవైశ్య జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆదేశాలు నియమ నిబంధనలు పాటిస్తామని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని బాలరాజు శెట్టి పేర్కొన్నారు
ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆర్యవైశ్య యువకులు న్యాయవాదులు రిటైర్డ్ ఉపాధ్యాయులు మొగ్గుచూపుతున్నట్లు సంఘం అభ్యర్థిలుగా పోటీ చేసే వారికి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని పూరి బాలరాజ్ ప్రకటనలో పేర్కొన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
