ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో.. భారత సైన్యం చూపిన తెగువకు గుర్తుగా సాంబా సెక్టార్‌లోని ఓ పోస్టుకు ‘సిందూర్’ అని పేరు పెట్టాలని బీఎ్‌సఎఫ్ ప్రతిపాదించింది. అలాగే మే 10న సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో అమరులైన ఇద్దరు బీఎ్‌సఎఫ్ సిబ్బంది పేర్లను మరో రెండు పోస్టులకు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మే 10న పాకిస్థాన్ బీఎ్‌సఎఫ్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేయగా, బీఎ్‌సఎఫ్ ఎస్‌ఐ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ అమరులయ్యారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
