తెలుగుజాతి ఇలవేలుపు, మరణం లేని జననం,తెలుగుజాతి కీర్తి మకుటం, తెలుగునేల ముద్దుబిడ్డ, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ, మాజీ ముఖ్యమంత్రి వర్యులు , స్వర్గీయ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో పద్మ శ్రీ, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తో కలిసి పూలమాల వేసి ఘన నివాళ్ళుర్పించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన మాహానుభావుడు , విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు ,ఎన్టీఆర్ 102వ జయంతి ని పురస్కరించుకుని జయంతి వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని,సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో, విశ్వ విఖ్యాత నట సార్వాభౌమునిగా యావత్ ప్రపంచానికి ఆయన ఒక కళాప్రవీనుడిగా, కుల,మత బేధం లేకుండా అందరి అభివృద్ధి కోసం కృషి చేసిన సాక్షాత్ భగవత్ స్వరూపుడుగా అందరివాడు అయినటువంటి మన అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీ.శే. శ్రీ.నందమూరి తారకా రామారావు కి జన్మదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, PAC చైర్మన్ గాంధీ తెలియజేసారు . అదేవిదంగా ఎంతో మందికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని PAC చైర్మన్ గాంధీ కొనియాడారు.రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు, పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం కైవసం చేసుకొని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నానుడి నిజం చేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయం గా ముందుకు వెళ్లారని బడుగు బలహీన వర్గాలకు, యువత కు రాజకీయ అవకశాలు కలిపించి కొత్త అధ్యాయం ఎన్టీఆర్ సృష్టించారని ,
మరణం లేని జననం.
తెలుగువాడి కీర్తిని నలుదిశలా ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మహానుభావుడు అని ,పేదవాడు బ్రతకడానికి కనీస అవసరాలైన తిండి, గూడు, బట్ట అని నమ్మి వాటిని కల్పించి వారి జీవితాలలో వెలుగు నింపారని, అభివృద్ధి ,సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన అందించిన పరిపాలన దక్షకుడు అని, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారాని, ఆస్తి హక్కు కలిపించారని, మహిళలకు రిజర్వేషన్ ,మహిళ సాధికారికథకు విశేష కృషి చేసిన మహాను బావుడు ఎన్టీఆర్ అని PAC చైర్మన్ గాంధీ కొనియాడారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
